Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. మానసిక,ఆరోగ్య సమస్యలే కారణమని నోట్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, 1975 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా (74) ఆత్మహత్య చేసుకున్నారు. నోయిడాలోని సెక్టార్-82 కేంద్రీయ విహార్-2 సొసైటీలో ఉన్న తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆయన తనువు చాలించారు. సెప్టెంబరు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాలు
భార్య ఫోన్‌కు స్పందించకపోవడంతో..
రాకేష్ మెహతా భార్య సుమంతి మెహతా ఘటన జరిగిన సమయంలో డెహ్రాడూన్‌లోని కుమారుడి వద్ద ఉన్నారు.
భర్తకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఫేజ్-2 పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉండటంతో పోలీసులు దాన్ని పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఫ్యాన్‌కు వేలాడుతున్న మెహతా మృతదేహాన్ని గుర్తించారు.
సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
మానసిక, ఆరోగ్య సమస్యలతోనే..
మెహతా రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్‌లో తనను వేధిస్తున్న మానసిక, ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నోట్‌తో పాటు ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించిన అధికారులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించే పనిలో ఉన్నారు.
షీలా దీక్షిత్ హయాంలో సీఎస్‌గా..
రాకేష్ మెహతా 2007 నుంచి 2010 నవంబరు వరకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.
అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రభుత్వ హయాంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పదవీకాలంలోనే 2010 కామన్వెల్త్ క్రీడలు ఢిల్లీలో జరిగాయి.
వివరాలు
ఢిల్లీ అభివృద్ధిలో కీలక పాత్ర..
కామన్వెల్త్ క్రీడలకు ముందు, తర్వాత ఢిల్లీని ఆధునీకరించేందుకు చేపట్టిన పలు కీలక ప్రాజెక్టుల్లో మెహతా చురుగ్గా వ్యవహరించారు.
ముఖ్యంగా రవాణా, విద్యుత్, మౌలిక వసతులకు సంబంధించిన అనేక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కమిషనర్‌గా కూడా మెహతా బాధ్యతలు చేపట్టారు.
ఆ హోదాలోనూ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుని మంచి పేరు సంపాదించారు.
వివరాలు
లోధి రోడ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
మెహతా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సోమవారం లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ప్రస్తుతం ఫేజ్-2 పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌తో పాటు ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తూ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.