PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏ విషయాన్ని ప్రకటించబోతున్నారు?
ఆపరేషన్ సిందూర్‌పై స్పందించబోతున్నారా? ఇతర కీలక అంశాలపై ప్రకటన వెలువడనుందా? అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.
ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ గురించి త్రివిధ దళాధిపతులు జరిపిన ప్రెస్‌మీట్ ద్వారా పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఉగ్రవాదులకు అండగా నిలిచిన పాకిస్థాన్‌కు భారత్ గట్టి బుద్ధి చెప్పిందని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు. పాకిస్థాన్ వైపు నుంచి ఏ దాడి వచ్చినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని హితవు పలికారు.
Details
తాజా దాడుల్లో పాకిస్థాన్ కు తీవ్రమైన నష్టం
ఇక పాకిస్థాన్‌లోని కిరణా హిల్స్‌లో అణుశక్తి కేంద్రం ధ్వంసమైన విషయంపై వస్తున్న వార్తలపైనా వారు స్పందించారు. తాజా దాడుల్లో పాకిస్థాన్‌కు తీవ్రమైన నష్టం జరిగినట్లు అర్థమవుతోంది.
మరోవైపు, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
మతం పేరుతో సాగిన ఈ ఉగ్రదాడికి పాకిస్థాన్ గూఢచర్య సంస్థల ప్రమేయం ఉందని భారత్ గుర్తించింది.
దీంతోనే ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులకు పాల్పడి విజయం సాధించింది.