LOADING...
Chutneys: ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు
ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

Chutneys: ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్'లోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. హోటల్ కిచెన్'లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి హోటల్లో ఉన్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

Advertisement