Page Loader
Delhi Fake Doctors : దిల్లీలో నలుగురు ఫేక్ డాక్టర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Delhi Fake Doctors: నలుగురు ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు..రోగులకు ప్రాణగండంగా నకిలీ వైద్యులు

Delhi Fake Doctors : దిల్లీలో నలుగురు ఫేక్ డాక్టర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 16, 2023
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో దారుణం జరిగింది. వైద్యో నారాయణ హరి అన్న నానుడికి ఈ నకిలీ వైద్యులు తిలోదకాలిచ్చారు. ఈ మేరకు నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. దక్షిణ దిల్లీ ప్రాంతంలోని ఓ క్లినిక్‌లో శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్ల మృతికి సంబంధించి దిల్లీ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు నకిలీ వైద్యులు, ఫేక్ మహిళ డాక్టర్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, పలువురు రోగులు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే దిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పలుమార్లు పోలీసులు ఫిర్యాదులు అందాయి. డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్‌ప్రీత్ సింగ్‌తో పాటు మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని దిల్లీ పోలీసులు తెలిపారు.

DETAILS

ఇద్దరు రోగుల ప్రాణాలు తీసిన నకిలీ వైద్యులు

అస్గర్ అలీ అనే రోగి 2022లో పిత్తాశయ చికిత్స కోసం క్లినిక్‌లో చేరాడు. మొదట్లో, అలీకి సర్జరీని అర్హత కలిగిన సర్జన్ డాక్టర్ జస్‌ప్రీత్ చేస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. తీరా ఆస్పత్రిలోని ఆపరేషన్ గదిలో పూజ అగర్వాల్ సహా టెక్నీషన్ మహేంద్ర ప్రత్యక్షమయ్యారు. సదరు రోగికి ఈ ఇద్దరు కలిసి సర్జరీ చేయడంతో అతడు తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు. 2016 నుంచి ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలోని వైద్యులపై దాదాపుగా ఏడు ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ అగర్వాల్ సహా మరో ముగ్గురు నకిలీ వైద్యులు ప్రోటోకాల్‌ పాటించకుండా బహుళ రోగుల కీలక అవయవాలపై శస్త్రచికిత్సలు చేశారని బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అగర్వాల్ ఆస్పత్రిలో నకిలీ వైద్యులను అరెస్ట్ చేసిన పోలీసులు