LOADING...
plums: చెట్ల కింద పడిన రేగుపండ్లతో రైతుకు బంగారు ఆదాయం
చెట్ల కింద పడిన రేగుపండ్లతో రైతుకు బంగారు ఆదాయం

plums: చెట్ల కింద పడిన రేగుపండ్లతో రైతుకు బంగారు ఆదాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పుర్‌ జిల్లాలోని ఝన్వర్‌ గ్రామానికి చెందిన రైతు రాజేంద్రకుమార్‌ పటేల్‌ ఒక వినూత్న ఆలోచనతో మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. పొలాల్లో చెట్ల కింద వృథాగా పడిపోయే రేగుపండ్లను సేకరించి, వాటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఈ విధానం వల్ల తనకే కాకుండా చుట్టుపక్కల రైతులకు కూడా అదనపు ఆదాయం లభిస్తోంది. జోధ్‌పుర్‌ ప్రాంతంలో రేగు సాగు విస్తృతంగా ఉంటుంది. ప్రతి ఏడాది అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ పంటను రైతులు విక్రయిస్తుంటారు. అయితే చెట్ల కింద పడిన రేగుపండ్లను చాలామంది ఇంటికి తీసుకెళ్లడం లేదా అలా వదిలేయడం చేస్తుంటారు.

వివరాలు 

ఆయుర్వేద మందుల తయారీలో ఎండు రేగుపండ్ల వినియోగం 

ఎండు రేగుపండ్లకు బయట మార్కెట్లలో మంచి డిమాండ్‌ ఉందని గుర్తించిన రాజేంద్రకుమార్‌, చుట్టుపక్కల ఉన్న దాదాపు 50 గ్రామాల నుంచి రోజుకు 300 నుంచి 400 బస్తాల వరకు పండ్లను కిలోకు రూ.20 నుంచి రూ.30 ధర చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని తన పొలంలో సుమారు పది రోజుల పాటు ఎండబెట్టి, బస్తాల్లో ప్యాక్‌ చేసి ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర మార్కెట్లకు, సిలిగుడి మార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఎండు రేగుపండ్లను సుగంధ ద్రవ్యాల తయారీతో పాటు ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. ఇదిలా ఉండగా, ఖాళీ సమయాల్లో రాజేంద్రకుమార్‌ బైక్‌ మెకానిక్‌గా కూడా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Advertisement