
southwest monsoon: బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం,మాల్దీవులు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు,అండమాన్,నికోబార్ దీవుల వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ విస్తరణకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వివరాలు
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
గురువారం నాడు ఉత్తర కోస్తా జిల్లాల్లో, శుక్రవారం నాడు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇక రాష్ట్ర మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
గురువారం రోజున అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.