Page Loader
Arsenic: బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!
బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!

Arsenic: బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

వాతావరణ మార్పుల ప్రభావంతో బియ్యంలో ఆర్సెనిక్‌ స్థాయిలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్‌కు ప్రధాన కారకాల్లో ఒకటైన ఆర్సెనిక్‌ విషపూరితత 2050 నాటికి మరింత తీవ్రమవుతుందని తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే నేలలో నిర్మాణ మార్పులు వస్తాయి. అలాగే వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు పెరిగితే వరి మొక్కల జీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా ఆ మొక్కలు ఆర్సెనిక్‌ను పీల్చుకునే శక్తిని పెంచుకుంటాయి.

Details

భారతదేశంలో ప్రభావం

ప్రపంచ వ్యాప్తంగా ప్రతేడాది సుమారు 54 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవుతోంది. ఇందులో 27 శాతం వరి భారతదేశంలోనే పండుతోంది. వాతావరణ మార్పులతో వరి లోపల ఆర్సెనిక్‌ చేరడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆసియా, ఆగ్నేయాసియాలో వరి పంట సాగు విస్తృతంగా ఉండటంతో ఈ ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది.

Details

ఆరోగ్య ముప్పు పెరుగుతోంది 

వాతావరణ మార్పుల వల్ల ఈ కాలుష్యం మరింత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. దీని ఫలితంగా క్యాన్సర్‌, గుండెజబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు పెరగవచ్చని తెలిపారు. కాలుష్యమైన మట్టి, సాగునీటిలో ఆర్సెనిక్‌ ఉండటం పెద్ద సమస్య. పైగా, ఆ నీటిని వంటకు ఉపయోగించడం వల్ల ఆహారంలో ఆర్సెనిక్‌ చేరి ముప్పు మరింత తీవ్రతరమవుతుంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో లక్షలాది క్యాన్సర్‌ కేసులు నమోదుకావచ్చని, ముఖ్యంగా ఊపిరితిత్తులు, ప్రొస్టేట్‌ క్యాన్సర్లు పెరగవచ్చని అధ్యయనం హెచ్చరిస్తోంది. అదే సమయంలో చైనాలో ఒక్కటే 1.34 కోట్ల ఆర్సెనిక్‌ సంబంధిత క్యాన్సర్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రభావం కూడా వృద్ధి చెందుతుందని నివేదిక హితవుపలికింది.