
Jammu and Kashmir: కుల్గామ్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం కొద్ది గంటల క్రితం మట్టుబెట్టినప్పటికీ, తంగ్‌మార్గ్ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ భద్రతా బలగాలకు చిక్కినట్లు సమాచారం అందింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
వివరాలు
పాకిస్థాన్ కరెన్సీ స్వాధీనం
మునుపటి పహల్గాం ఘటనకు సంబంధించి తాము బాధ్యులమని 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు, నేటి తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా, వారిని భారత సైన్యం కాల్చి చంపింది.
ఎన్‌కౌంటర్ అనంతరం, భద్రతా బలగాలు భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పాకిస్థాన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాయి.