LOADING...
Ketan murder Case: కేతన్ పాస్‌పోర్టు మాయపై కొత్త కోణం.. క్యాబ్ డ్రైవర్ సంచలన వాంగ్మూలం
కేతన్ పాస్‌పోర్టు మాయపై కొత్త కోణం.. క్యాబ్ డ్రైవర్ సంచలన వాంగ్మూలం

Ketan murder Case: కేతన్ పాస్‌పోర్టు మాయపై కొత్త కోణం.. క్యాబ్ డ్రైవర్ సంచలన వాంగ్మూలం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కేతన్, సియా కలిసి బాలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే చివరి క్షణంలో కేతన్ పాస్‌పోర్టు కనిపించకుండా పోవడంతో ఆ పర్యటన రద్దయింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కేతన్, సియాలను ముంబయి విమానాశ్రయానికి తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ కీలక విషయాలను వెల్లడించాడు. బాలి ప్రయాణం కోసం మొదట సియా, ఆమె సోదరుడు సాహిల్ కారులో ఎక్కారని తెలిపాడు. సాహిల్ బలవంతంగానే సియాను కారులో కూర్చోబెట్టినట్లు తనకు అనిపించిందని చెప్పాడు. అనంతరం రావెట్ ప్రాంతంలో కేతన్ కూడా కారులో చేరాడని వివరించాడు.

వివరాలు 

పర్సులో నుంచి ఏదో వస్తువు తీసుకున్నట్లు గమనించిన డ్రైవర్ 

కొంత దూరం ప్రయాణించిన తర్వాత టీ తాగేందుకు కారు ఆపాలని సియా కోరిందని డ్రైవర్ తెలిపాడు. టీ తాగిన తర్వాత కారు బూట్ తెరవాలని ఆమె చెప్పిందని,ఆ సమయంలో తన పర్సులో నుంచి ఏదో వస్తువు తీసుకున్నట్లు తాను గమనించానని వెల్లడించాడు. అయితే ఆమె ఏమి తీసుకుందో మాత్రం తనకు తెలియదని చెప్పాడు. అనంతరం వారిని ముంబయి విమానాశ్రయంలో దించేసినట్లు వివరించాడు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే తనకు కేతన్ బృందం నుంచి ఫోన్ వచ్చిందని డ్రైవర్ తెలిపాడు. కారులో చిన్న బ్యాగ్ మరిచిపోయామని చెప్పడంతో తిరిగి వెళ్లి ఆ బ్యాగ్ అందజేశానని చెప్పాడు.

వివరాలు 

వీడియో కాల్ ద్వారా మొత్తం కారు తనిఖీ

అక్కడి నుంచి సుమారు 500మీటర్లు వెళ్లిన తర్వాత మళ్లీ ఫోన్ చేసి కేతన్ పాస్‌పోర్టు కనిపించడం లేదని తెలిపారని వెల్లడించాడు. పాస్‌పోర్టు కారులోనే పడిపోయి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారని, తన వాహనంలో లేదని చెప్పినా నమ్మకుండా వీడియో కాల్ ద్వారా మొత్తం కారు తనిఖీ చేయించారని డ్రైవర్ వివరించాడు. అనంతరం కారును మళ్లీ విమానాశ్రయానికి తీసుకురావాలని చెప్పడంతో సాహిల్, కేతన్ కలిసి మరోసారి పూర్తిగా వెతికారని తెలిపాడు. అయినప్పటికీ పాస్‌పోర్టు లభించకపోవడంతో బాలి ప్రయాణాన్ని రద్దు చేసుకుని వారు వెనుదిరిగారని చెప్పాడు.

Advertisement

వివరాలు 

సియా, ఆమె సోదరుడు సాహిల్ మధ్య వాగ్వాదం

అలాగే కేతన్ కారులో ఎక్కే ముందు వరకు సియా, ఆమె సోదరుడు సాహిల్ మధ్య వాగ్వాదం జరిగినట్లు తాను గమనించానని డ్రైవర్ వెల్లడించాడు. కారు బూట్ వద్దకు వెళ్లిన సియా తన పర్సు తీసుకుని అందులో నుంచి ఏదో వస్తువు బయటకు తీసినట్లు కనిపించిందని,అయితే అది ఏమిటో మాత్రం తనకు తెలియదని స్పష్టం చేశాడు. బాలి పర్యటన రద్దుకు కారణమైన కేతన్ పాస్‌పోర్టు అదృశ్యంపై ప్రస్తుతం దర్యాప్తు బృందాలు లోతుగా విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ వెల్లడించిన అంశాలు కేసులో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఫిబ్రవరిలో కేతన్,సియాలకు నిశ్చితార్థం

కేతన్, సియాలు బాలి వెళ్లకుండా అడ్డుకునేందుకు కేతన్ పాస్‌పోర్టును ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని,ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని,హత్యకుట్రలో భాగంగానే జరిగి ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో కేతన్,సియాలకు నిశ్చితార్థం జరిగింది.జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలి వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనకు మొత్తం నలుగురు కలిసి వెళ్లాలని ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. మరోవైపు,కేతన్ తండ్రి కూడా పాస్‌పోర్టు అదృశ్యంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు కారులో ఉన్న నలుగురూ తమ తమ పాస్‌పోర్టులు,ఇతర ప్రయాణ పత్రాలను ఒకసారి సరిచూసుకున్నారని చెప్పారు. ఆ డాక్యుమెంట్‌లన్నింటినీ ఒకే పర్సులో ఉంచారని,అయినప్పటికీ కేవలం కేతన్ పాస్‌పోర్టు మాత్రమే కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

Advertisement