Page Loader
Mumbai: ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన వేలి అసలు రహస్యం బయటపడింది.. షాక్ కి గురిచేస్తున్న డీఎన్‌ఏ రిపోర్ట్  
ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన వేలి అసలు రహస్యం బయటపడింది..

Mumbai: ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన వేలి అసలు రహస్యం బయటపడింది.. షాక్ కి గురిచేస్తున్న డీఎన్‌ఏ రిపోర్ట్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 28, 2024
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మానవ వేలు కనిపించింది. ఈ వేలు ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కొద్దిరోజుల క్రితం వేలు కోసుకున్నట్లు వెల్లడైంది. పోలీసులు అతడికి డీఎన్‌ఏ పరీక్ష చేశారు. కోసిన వేలు పూణెలోని ఇందాపూర్‌లోని ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగిదేనని డీఎన్‌ఏ నివేదికలో స్పష్టమైంది. ఐస్‌క్రీం ఫ్యాక్టరీ ఉద్యోగి ఓంకార్ పోటే వేలి భాగం డీఎన్‌ఏ, ఐస్ క్రీం లో దొరికిన వేలి డీఎన్‌ఏ ఒక్కటేనని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

వివరాలు 

అసలు విషయం ఏంటంటే..?

ఈ విషయమై పోలీసు అధికారి మాట్లాడుతూ.. 'ఇందాపూర్ ఫ్యాక్టరీలో ఐస్‌క్రీం నింపే క్రమంలో పోటే మధ్య వేలు భాగం తెగిపోయింది. మలాడ్‌కు చెందిన ఓ వైద్యుడు ఐస్‌క్రీమ్‌ కోన్‌లో వేలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 18న ముంబై డాక్టర్‌కు ఐస్‌క్రీం కోన్‌లో మనిషి వేలి కనిపించింది. ఈ విషయాన్ని డాక్టర్ వీడియో తీసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. దీని తర్వాత, ఐస్‌క్రీం ప్యాక్ చేసిన రోజునే ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగి గాయపడ్డాడని విచారణలో తేలింది. ఆ తర్వాత ఐస్‌క్రీమ్‌లో దొరికిన వేలు, ఉద్యోగి డీఎన్‌ఏ సరిపోలింది. డీఎన్‌ఏ పరీక్షలో ఐస్‌క్రీమ్‌లో దొరికిన వేలి భాగం ఉద్యోగిదేనని తేలింది.

వివరాలు 

ఐస్ క్రీం కంపెనీ లైసెన్స్ సస్పెండ్ 

యుమ్మోకు ఐస్‌క్రీం సరఫరా చేస్తున్న తయారీ కంపెనీ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (FSSAI) సస్పెండ్ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంత కార్యాలయానికి చెందిన బృందం ఐస్‌క్రీం తయారీదారు ప్రాంగణాన్ని తనిఖీ చేసిందని, దాని లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ తెలిపారు. దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని సీలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆహార పదార్థాలలో కల్తీ చేయడం, మానవ ప్రాణాలకు హాని కలిగించే ఆరోపణలపై కంపెనీపై కేసు నమోదైంది.

వివరాలు 

డాక్టర్ ఫిర్యాదు చేశారు 

ముంబైకి చెందిన 26 ఏళ్ల డాక్టర్ ఓర్లెమ్ బ్రాండన్ సెర్రావ్ తన సోదరి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో వేలును కనుగొన్నాడు. డాక్టర్ సెర్రావ్ మాట్లాడుతూ, సగం తిన్న తర్వాత, నా నోటిలో గట్టి ముక్క తగిలింది. నేను అది గింజ లేదా చాక్లెట్ ముక్క కావచ్చు అనుకున్న.. కానీ ఒక్కసారి డౌట్ వచ్చి ఉమ్మివేసాను. నేను డాక్టర్ని, కాబట్టి శరీర భాగాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేను దానిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, నాకు దాని క్రింద గోర్లు, వేలిముద్రలు కనిపించాయి. అది బొటనవేలులా కనిపించింది. ఆ రోజు నుంచి నేను షాక్‌లో ఉన్నాను.