Loading...
FIR Registered Rahul Gandhi :ఆకాశవాణి భవన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశం.. రాహుల్,ప్రియాంకపై ఎఫ్‌ఐఆర్ నమోదు
రాహుల్,ప్రియాంకపై ఎఫ్‌ఐఆర్ నమోదు

FIR Registered Rahul Gandhi :ఆకాశవాణి భవన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశం.. రాహుల్,ప్రియాంకపై ఎఫ్‌ఐఆర్ నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ మంగళవారం చేపట్టిన ఆందోళనకు సంబంధించి ఇండియా కూటమి నేతలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ఎంపీలపై ఈ కేసు నమోదైంది. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌గా వెళ్తున్న సమయంలో ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలోకి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించారన్నది పోలీసుల ఆరోపణ. అక్కడే నిరసనకు దిగిన నేతలు ప్రాంగణం నుంచి వెళ్లేందుకు నిరాకరించి ఆందోళన కొనసాగించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఇండియా కూటమి నేతలు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

వివరాలు 

ఈ అంశాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు

అనంతరం రాహుల్, ప్రియాంకతో పాటు పలువురు నేతలు ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలో బైఠాయించి నిరసన చేపట్టారు.

ఎన్నికల సంఘం అధికారులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

పోలీసులు పలుమార్లు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని కోరినప్పటికీ నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించలేదని అధికారులు వెల్లడించారు.

దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రాహుల్ గాంధీ,ప్రియాంకా గాంధీ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

అనుమతి లేకుండా ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించడం, అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించి నిరసన కొనసాగించడం వంటి అంశాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

అయితే ఈ కేసులో ఏయే చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

ADVERTISEMENT