Page Loader
UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
చిన్నారుల సజీవ దహనం .. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

UP: ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 10 మంది చిన్నారులు సజీవంగా దగ్ధమయ్యారు. అగ్ని ప్రమాదం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. న్యూఓనేటల్‌ ఐసీయూలో మంటలు చెలరేగడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వల్ల ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి, స్థానిక అధికారులు పర్యవేక్షణ చేపట్టారు.

Details

రూ. 5లక్షలు నష్టపరిహారం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించగా, గాయపడిన వారికి రూ.50వేలు ఇచ్చేందుకు ఆదేశించారు. ఝాన్సీలోని మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని, ఈ ఘటనలో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు. భగవంతుడు వారికి ఈ అపార నష్టాన్ని భరించడానికి శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని జిల్లా కలెక్టర్ అవినాశ్‌కుమార్‌ తెలిపారు.