పశ్చిమ బెంగాల్: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24పరగణాస్ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడినట్లు అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. దుత్తపుకూరులో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగింది. ఈ ప్రమాదం వల్ల పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు ఆరుగురు గాయపడినట్లు అధికారులు తనకు చెప్పినట్లు రాష్ట్ర ఆహార మంత్రి, స్థానిక ఎమ్మెల్యే రథిన్ ఘోష్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని తాను సందర్శిస్తానని ఆయన చెప్పారు. పేలుడు జరిగిన భవనంలో బాణాసంచా నిల్వలు ఉన్నందున ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిడ్నాపూర్ జిల్లాలోని ఎగ్రా వద్ద మేలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది చనిపోయారు.