
Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
ధనాబాద్ జంక్షన్ నుంచి అలప్పుళ వెళ్లే అలప్పుళ్ల ఎక్స్‌ప్రెస్ రైలు (13351) కేరళ రాష్ట్రంలోని మధుకరై స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది.
రైలులోని B4, B5 బోగీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రైలును వెంటనే ఆపేశారు. స్టేషన్ సిబ్బంది మంటలను వెంటనే గమనించి లోకో పైలట్‌కు సిగ్నల్ ఇవ్వడంతో రైలు నిలిపివేశారు.
రైలు ఆగడంతో ప్రయాణికులు అప్రమత్తమై రైలుపై నుంచి సురక్షితంగా బయటకు పరుగులు తీశారు.
ఈ రైలులో శబరిమలై యాత్రకు వెళ్తున్న ఇల్లందుకు చెందిన పదిమంది అయ్యప్ప భక్తులున్నారు.
Details
సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
వారు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
ప్రమాదానికి గల కారణాలను పరిశీలించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.