
No Firecrackers : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో బాణసంచాపై నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు హైదరాబాద్ నగరంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి.
సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఃనగరవ్యాప్తంగా బాణాసంచా కాల్చడాన్ని తక్షణమే నిషేధించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో బాణాసంచా శబ్దాలు పేలుళ్ల శబ్దాలలా అనిపించి ప్రజల్లో భయాందోళనలకు కారణమవచ్చన్నది సీపీ అభిప్రాయపడ్డారు.
ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు, అవాంఛనీయ పరిస్థితులను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్న చర్యలపై పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తారని పేర్కొన్నారు.
Details
నిషేధం తక్షణమే అమల్లోకి
ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని, దాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాధారణంగా పండుగలు, వేడుకల సందర్భంగా బాణాసంచా కాల్చడం హైదరాబాద్‌లో సాధారణమే అయినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, నిబంధనలను పాటించాలని సీపీ సీవీ ఆనంద్ కోరారు.
నగరంలో శాంతిభద్రతను కాపాడేందుకు పోలీసుశాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.
సరిహద్దు పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే నిషేధాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.