Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు. బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సోంకర్‌కు 16ఓట్లు రాగా.. కుల్దీప్ కుమార్‌కు 12ఓట్లు వచ్చాయి. ఎనిమిది ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. ఇండియా కూటమిలో ఆప్‌కు 13మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ ఏడుగురు సభ్యులు ఉన్నా కూడా.. 14మంది కౌన్సిలర్లు ఉన్న బీజేపీ గెలవడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ప్రిసైడింగ్ అధికారి కావాలనే విపక్షాల కౌన్సిలర్లు ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఇండియా కూటమి ఆరోపించింది. దీనిపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పదించారు. బీజేపీ మోసం చేసిందన్నారు. ఎన్నికల ప్రక్రియపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.