LOADING...
AP: ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతి
ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతి

AP: ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు భారత అత్యున్నత సివిల్ సర్వీసైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా లభించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది శిక్షణ విభాగం (DoPT) వీరి ఐఏఎస్‌ ప్రమోషన్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సాయి ప్రసాద్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

తాజా ప్రమోషన్‌తో ఐఏఎస్‌ హోదా

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్-2024) ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నాన్-స్టేట్ సివిల్ సర్వీస్‌కు చెందిన ఈ అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతి కల్పించారు. ఈ పదోన్నతి పొందిన అధికారుల్లో ప్రభల గోపీనాథ్, గుడిస బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఎ.ఏ.ఎల్. పద్మావతి, డాక్టర్ మామిళ్లపల్లి వరప్రసాద్ ఉన్నారు. వీరంతా ఇప్పటివరకు గ్రూప్-1 అధికారులుగా వివిధ శాఖల్లో సేవలు అందించగా, తాజా ప్రమోషన్‌తో ఐఏఎస్‌ హోదాను పొందారు.

Advertisement