Loading...
Vamsadhara and Nagavali Rivers: వంశధార,నాగావళిలో పెరుగుతున్న వరద.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ
వంశధార,నాగావళిలో పెరుగుతున్న వరద.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ

Vamsadhara and Nagavali Rivers: వంశధార,నాగావళిలో పెరుగుతున్న వరద.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రధాన నదులైన వంశధార, నాగావళిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన బ్యారేజీలు, ఆనకట్టల వద్ద తొలి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

వివరాలు 

వంశధారలో పెరిగిన వరద ప్రవాహం

వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరికను అధికారులు అమలు చేశారు.

ప్రస్తుతం బ్యారేజ్‌లోకి 41,014 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అదే స్థాయిలో 41,014 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నాగావళిలోనూ ఉద్ధృతి

నాగావళి నదిలో కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. తోటపల్లి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 45,661 క్యూసెక్కులుగా నమోదైంది.

ఇదే సమయంలో నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం 59,700 క్యూసెక్కులకు చేరింది.

దీంతో అక్కడ కూడా అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

వివరాలు 

నదుల్లోకి వెళ్లొద్దని హెచ్చరిక

వరద పరిస్థితులపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందించారు.

నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం నదుల్లో వరద ఉద్ధృతి అధికంగా ఉన్నందున ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటి పనులు అత్యంత ప్రమాదకరమని తెలిపారు.

ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులకి పెరుగుతున్న వరద ఉధృతి

ADVERTISEMENT