Page Loader
Passengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్ 
Passengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్

Passengers poisoning: గుజరాత్ వెళ్తున్న రైలులో 90 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్ 

వ్రాసిన వారు Stalin
Nov 29, 2023
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై-గుజరాత్(Chennai-Gujarat) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు(special train)లో దాదాపు 90మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్(food poisoning) కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు బుధవారం వెల్లడించారు. పూణె రైల్వే స్టేషన్‌లోని వైద్యులు అస్వస్థతకు గురైన ప్రయాణికులను పరీక్షించి అవసరమైన చికిత్స అందించారు. చికిత్స అనంతరం రైలు తిరిగి బయలుదేరిందని అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని పాలిటానాలో మతపరమైన కార్యక్రమం కోసం 'భారత్ గౌరవ్' రైలును ఒక బృందం ప్రైవేట్‌గా బుక్ చేసిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివరాజ్ మనస్పురే తెలిపారు. ఆ రైలులో ప్రయాణిసున్న వారు ఆహారాన్ని ప్రైవేట్‌గా కొనుగోలు చేశారని, రైల్వే లేదా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరఫరా చేయలేదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పూణెలో స్టేషన్‌లో ప్రయాణికులకు చికిత్స