
కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వేశాఖ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ మధురలోని కృష్ణ జన్మభూమి వెనుక భాగంలో రైల్వే భూముల్లోని ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు బుధవారం 10 రోజుల పాటు స్టే విధించింది.
రైల్వేశాఖను సమాధానం కోరుతూ ధర్మానసం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల తర్వాత ఈ కేసును విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
మధుర నుంచి బృందావనం వరకు వెళ్లే రైలు మార్గం ప్రస్తుతం మీటర్ గేజ్‌గా ఉంది. దీనిపై గత కొన్నేళ్లుగా రైలు రాకపోకలు నిలిచిపోయాయి.
లైన్‌కు ఇరువైపులా ప్రజలు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు దీన్ని బ్రాడ్ గేజ్ లైన్‌గా రైల్వే శాఖ అప్‌గ్రేడ్ చేస్తోంది.
రైల్వే
వందేళ్లుగా అక్కడే ఉంటున్నాం: బాధితులు
రైల్వే ట్రాక్‌కు ఇరువైపుల ఇళ్లు కట్టుకున్న వారు ఆ భూమిని ఖాళీ చేయాలని రైల్వే శాఖ నోటీసులు జారీ చేశారు. కానీ ప్రజలు ఖాళీ చేయకపోవడంతో రైల్వే అధికారులు ఆక్రమణలు కూల్చేందుకు సిద్ధమయ్యారు.
రైల్వే శాఖ తొలగింపులను ఆపాలని బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము 100 ఏళ్లకు పైగా అక్కడే స్థిరపడ్డామని పిటిషనర్లు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఆక్రమణ డ్రైవ్‌కు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్ అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.
విచారణ జరిగే వరకు ఆగకుండా రైల్వే అధికారులు బుల్డోజర్లతో కల్చివేతలను ప్రారంభించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.