NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mallareddy: భూ వివాదం కేసులో మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Mallareddy: భూ వివాదం కేసులో మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్ 
    Mallareddy: భూ వివాదం కేసులో మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్

    Mallareddy: భూ వివాదం కేసులో మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్ 

    వ్రాసిన వారు Stalin
    May 18, 2024
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ మంత్రి మల్లారెడ్డిని భూ వివాదం విషయంలో పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ విషయమై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

    కోర్టు వివాదంలోఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు.

    స్థలంలో వేసిన భారికెడ్లను మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించే ప్రయత్నం చేశారు.

    ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

    ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

    Details 

    దశాబ్దానికి పైగా కొనసాగుతున్న భూ వివాదం

    సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నెలకొంది.

    రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు.అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15మంది పేర్కొంటున్నారు.

    కాగా శనివారం సర్వే నెం.82లోని స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి.. మరో 15మంది మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

    ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామని,కోర్టుసైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15మంది పేర్కొంటున్నారు.

    అయితే, స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు.

    అయితే, మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని పోలీసులకు 15మంది సభ్యులు ఫిర్యాదు చేశారు.

    Details 

    మాజీ మంత్రి మల్లారెడ్డి వాదన ఇలా ఉంది 

    14 ఏళ్ల క్రితం తన అల్లుడు, కొడుకులు కలిసి ఈ ప్రాపర్టీతీసుకున్నారని, ఓ మార్వాడి సేటు దగ్గరనుంచి కొనుగోలు చేశామని మల్లారెడ్డి చెప్పారు.

    గతంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది. కానీ, కరీంనగర్ చెందిన కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ ల్యాండ్ తమదని అంటున్నారన్నారు.

    ఈ సర్వే నెంబర్లో మొత్తం 17ఎకరాలు ఉంది. అందులో రెండు ఎకరాలకుపైగా తానూ కొనుగోలు చేశానన్నారు.

    మేము కొనుగోలు చేసిన సర్వే నెంబర్లు వాళ్ల భూమేనంటూ చెబుతున్నారు. ఎనిమిదేళ్ల నుంచి పేట్ బషీరాబాద్ స్టేషన్ లో కేసుకు నడుస్తుంది. కరీంనగర్ కు చెందిన వాళ్లు నాలుగెకరాలు ఉందంటున్నారు.

    Details 

    మా దగ్గర దొంగ డాక్యుమెంట్లు లేవు: మల్లారెడ్డి

    నిజంగా మీకు ఇక్కడ ల్యాండ్ ఉంటే సర్వే పెట్టుకోమని గతంలో చెప్పాను. కానీ, నిన్నరాత్రి ల్యాండ్ లో వేసిన రేకుల షెడ్లు దౌర్జన్యంగా తొలగించారు.

    తమ ల్యాండ్ లో దౌర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. మా వాచ్ మెన్ల ఫోన్లను లాక్కున్నారు.

    మా జాగాలో మమ్ముల్ని కూడా కూర్చొని ఇవ్వడం లేదు. మా దగ్గర దొంగ డాక్యుమెంట్లు లేవు. వాళ్లు అన్నట్లు నాలుగు ఎకరాల భూమి ఎక్కడుందో సర్వేచేసి చూపించండి.

    కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత దౌర్జన్యంగా నడుస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు రక్షణ లేకపోతే ఎలా. సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మల్లారెడ్డి ప్రశ్నించారు.

    మా ప్రభుత్వం పోయింది.. చేసేదేమీ లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

    Details 

    2000 సంవత్సరంలో సర్వే 

    మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో ప్రత్యర్థివర్గంకు చెందిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసర్వే నెంబర్లు ఉన్న ల్యాండ్ మొత్తం తనదేనని మల్లారెడ్డి అంటున్నాడు.

    82/1/88 మా సర్వే నెంబర్. 82/a మల్లారెడ్డిది. ఎకరం 29 కుంటలు మల్లారెడ్డికి ఉంది. సర్వేచేస్తే ఎవరు ల్యాండ్ వాళ్లకి వస్తుంది.

    కానీ, మల్లారెడ్డి మాత్రం మొత్తం ఈ సర్వే నెంబర్లో ఉంది నాది అంటున్నారు. 2000 సంవత్సరంలో సర్వే జరిగింది. హైకోర్టు డైరెక్షన్లో డిప్యూటీ లీగల్ సర్వేయర్ ద్వారా సర్వే యించుకున్నాం.

    Details 

    పోలీసులతో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి  వాగ్విదం 

    మల్లారెడ్డి ల్యాండ్ కు ఎలాంటి డాక్యుమెంటు లేవు. సర్వే కూడా చేయలేదు. మల్లారెడ్డి అనుచరులు మమ్మల్ని పోలీసోళ్ల ముందే కొట్టే ప్రయత్నం చేశారు.

    ఇదిలాఉంటే.. పోలీసులతో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. నా ల్యాండ్ లో నేను ఉన్నాను. గతంలోకూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం.

    మేము ఎవరి భూమిని ఆక్రమించలేదని అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మేడ్చల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మేడ్చల్

    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  తెలంగాణ
    Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు చామకూర మల్లారెడ్డి
    Mallareddy: ఆ భూమితో నాకు సంబంధం లేదు.. స్పందించిన మాజీ మంత్రి మాల్లారెడ్డి సికింద్రాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025