Page Loader
Aroori Ramesh: బీజేపీలో చేరిన అరూరి రమేష్ 
Aroori Ramesh: బీజేపీలో చేరిన అరూరి రమేష్

Aroori Ramesh: బీజేపీలో చేరిన అరూరి రమేష్ 

వ్రాసిన వారు Stalin
Mar 17, 2024
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో ఆదివారం చేరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అరూరి రమేష్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను వీడకుండా రమేష్‌ను ఒప్పించేందుకు చాలామంది ప్రయత్నించారు. ఆరూరి రమేష్‌ను ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట తీసుకెళ్లి.. బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుతో కూడా మాట్లాడించారు. అయినా కూడా ఆయన మనసు మార్చుకోలేదు. చివరికి బీజేపీ చేరేందుకు నిర్ణయించుకొని, బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన ఆరూరి రమేష్