Page Loader
తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

వ్రాసిన వారు Stalin
May 01, 2023
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీంతో ఉత్తర, వాయువ్య, మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు, వడగళ్ల వానలతో పాటు గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని ఐఎండీ చెప్పింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే ఐదు రోజుల పాటు వాయువ్య భారతదేశంలోని మైదానాలలో విస్తృతంగా కురిసే వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

వర్షాలు

తెలంగాణలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు

ముఖ్యంగా తెలంగాణలో గత కొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు వేసవిలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఆదివారం తక్కువ నమోదవుతున్నాయి. హన్మకొండలో ఆదివారం 10.3డిగ్రీలు తక్కువగా నమోదు కాగా, మెదక్‌లో 9.1 డిగ్రీలు క్షీణించినట్లు ఐఎండీ చెప్పిది. భద్రాచలంలో 8.1 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 7.7 డిగ్రీలు తగ్గినట్లు ఐఎండీ పేర్కొంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 7.5డిగ్రీలు తగ్గి 31.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వివరించింది.