Telangana Women's Commission: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు కొత్త ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. కమిషన్ సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరాలను నియమించారు. వీరి పదవీకాలం ఐదేళ్లపాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మహిళల హక్కుల పరిరక్షణ, వారిపై జరిగే అన్యాయాలు,వేధింపులను నిరోధించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తోంది. మహిళలకు న్యాయం అందించడం, సంక్షేమం కల్పించడం, సాధికారత పెంపొందించడం వంటి అంశాల్లో ఈ కమిషన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మి గారిని, ఇతర సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది @SCWTelangana #Telangana pic.twitter.com/af0C6DDOcf
— CPRO to CM / Telangana (@CPRO_TGCM) May 11, 2026