Page Loader
లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య 
లక్నో కోర్టులో తుపాకీ కాల్పులు ;గ్యాంగ్ స్టర్ హత్య

లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య 

వ్రాసిన వారు Stalin
Jun 07, 2023
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో ఒక గ్యాంగ్‌స్టర్‌ను ప్రత్యర్థి కాల్చి చంపాడు. చనిపోయిన వ్యక్తిని గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవా అలియాస్ సంజీవ్ మహేశ్వరిగా పోలీసులు చెప్పారు. న్యాయవాది దుస్తుల్లో వచ్చిన ప్రత్యర్థి కోర్టు వెలుపల కాల్పులకు తెగబడ్డాడు. దాడికి పాల్పడిన తర్వాత షూటర్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ట్రామా సెంటర్‌కు పంపారు. నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడు అనే దానిపై తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. జీవాపై డజను పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతను చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అతనిపై కనీసం 50 క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్నో కోర్టులోని దృశ్యాలు