ONGC Gas Leak: ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్.. స్థానికుల్లో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ పరిధిలో సుమారు రెండు గంటలుగా భూమి నుంచి గ్యాస్ ఉప్పొంగుతూ బయటకు వస్తోంది. ఈ లీక్ కారణంగా అక్కడ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఓఎన్జీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్ - స్థానికుల్లో భయాందోళన
ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్ – స్థానికుల్లో భయాందోళన
— Everest News (@Everest_News7) January 5, 2026
అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ వద్ద గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది.
డ్రిల్ సైట్ నుంచి భారీగా గ్యాస్ ఎగజిమ్ముతుండటంతో
పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది.
సమాచారం… pic.twitter.com/PuWhFECq0T