MM Naravane: 'ఆ రోజు రాత్రి రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారు'.. ఆత్మకథలో గల్వాన్ ఘటనను వివరించిన నరవాణే
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 31, 2020న చైనా సైన్యం లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వద్దకు ట్యాంకులతో చేరుకున్నప్పుడు గాల్వాన్ వ్యాలీలో భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే.
నాటి ఉద్రిక్తతలపై అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తాజాగా కీలక కామెంట్స్ చేశారు.
నరవాణే తన ఆత్మకథ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'లో ఆగస్టు 31, 2020 రాత్రి గురించి ప్రస్తావించారు.
ఆనాడు తలెత్తిన కఠిన పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం సైన్యానికి స్వేచ్ఛనిచ్చిందని పేర్కొన్నారు.
ఆరోజు రాత్రి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు వివరించారు.
సరిహద్దులో ప్రతిష్టంభనను ఎదుర్కోవడానికి 'మీకు ఎలా అనిపిస్తే అలా ముందకు వెళ్లండి' అంటూ రాజ్‌నాథ్ సింగ్ తనకు చెప్పినట్లు ఎంఎం నరవాణే వెల్లడించారు.
సరిహద్దు
ఆ సమయంలో తన మదిలో వందరకాలు ఆలోచనలు: నరవాణే
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై ఆ రోజు రాత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో తాను మాట్లాడినట్లు నరవాణే చెప్పారు.
రక్షణమంత్రి తనకు రాత్రి 10.30గంటలకు ఫోన్ చేసినట్లు గుర్తు చేశారు.
తాను ప్రధానితో మాట్లాడానని, ఇది పూర్తిగా సైనిక నిర్ణయమని, మీకు ఏది అనిపిస్తే చేయాలని రాజ్‌నాథ్ చెప్పినట్లు నరవాణే అన్నారు.
ఈ సమయంలో పూర్తి బాధ్యతను తనకే అప్పగించారన్నారు. తనకు ఏమి చేయాలో అర్థం కాలేదన్నారు.
ఆ సమయంలో యుద్ధం చేయాలా? వద్దా? ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇలా తన మదిలో వందల రకాల ఆలోచనలు మెదిలాయని వెల్లడించారు.