Loading...
Madhya Pradesh: కారుపై గర్ల్‌ఫ్రెండ్‌ 3,400 ముద్దులు.. ప్రియుడికి భారీ ఫైన్
కారుపై గర్ల్‌ఫ్రెండ్‌ 3,400 ముద్దులు.. ప్రియుడికి భారీ ఫైన్

Madhya Pradesh: కారుపై గర్ల్‌ఫ్రెండ్‌ 3,400 ముద్దులు.. ప్రియుడికి భారీ ఫైన్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు చేసే వింత ప్రయత్నాలు చివరికి చిక్కుల్లో పడేస్తుంటాయి. మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమజంట చేసిన ఇలాంటి ప్రయత్నమే ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియా లైక్స్‌ కోసం చేసిన స్టంట్‌.. చివరకు ట్రాఫిక్‌ పోలీసుల జరిమానాకు దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆదిత్య సికార్వార్‌ కారును అతడి ప్రేయసి వినూత్నంగా అలంకరించింది. కారుపై లిప్‌స్టిక్‌తో ఏకంగా 3,400 ముద్దుల ముద్రలను వేసింది. ఇలా కిస్‌ మార్కులతో నిండిన కారులో ఆదిత్య నగరంలోని రోడ్లపై తిరిగాడు.

వివరాలు 

ఆదిత్యకు రూ.5,500 జరిమానా

ఈ వింత కారు స్థానికుల దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలోకి చేరడంతో వైరల్‌గా మారాయి.

విషయం ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

వాహనానికి నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి రోడ్లపై నడిపినందుకు ఆదిత్యకు రూ.5,500 జరిమానా విధించారు.

అంతేకాదు.. కారుపై ఉన్న 3,400 లిప్‌స్టిక్‌ ముద్రలను కూడా తొలగించాలని పోలీసులు ఆదేశించారు.

చివరకు ఆదిత్యతోనే కారుపై ఉన్న కిస్‌ మార్కులన్నింటినీ శుభ్రం చేయించారు.

సోషల్‌ మీడియాలో లైక్స్‌, వ్యూస్‌ కోసం చేసిన ఈ వింత ప్రయత్నం.. చివరికి రూ.5,500 జరిమానాతో పాటు కారును స్వయంగా శుభ్రం చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రేమకు గుర్తుగా కారంతా ముద్దులు..  

ADVERTISEMENT