ఆత్రేయపురంలో బంగారం పూతరేకులు; ధరంతో తెలుసా?
పూతరేకులు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాల్లోని ఆత్రేయపురం. పూతరేకులకు ఆత్రేయపురం వరల్డ్ ఫేమస్ అని చెప్పాలి. ఇక్కడ తయారయ్యే రకరకాల పూతరేకులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతంటాయి. అయితే ఆదివారం అక్షయ తృతీయ సందర్భంగా ఆత్రేయపురంలోని ఒక పూతరేకుల తయారీదారు వెరైటీగా బంగారంతో పూతరేకులను తయారు చేశాడు. దాదాపు 24 క్యారెట్స్ ఎడిబుల్ బంగారంతో ఈ పూతరేకులను రూపొందించారు.
ఒకటి రూ. 800 చొప్పున విక్రయం
ఎడిబుల్ బంగారంతో తయారు చేసిన పూతరేకులను ఆత్రేయపురంలోని పలువురు కొని రూచి చూశారు. టేస్ట్ అదిరిపోయినట్లు తిన్నవారు రివ్యూ కూడా ఇచ్చేశారు. ఇంతకీ బంగారంతో తయారు చేసిన ఆ పూతరేకుల ధర ఎంత అనుకుంటున్నారా? ఒకటి రూ. 800 చొప్పున విక్రయించినట్లు తయారీదారు చాధస్తం చెప్పారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి