Loading...
Gold Rates Today: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇవే!
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇవే!

Gold Rates Today: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. శుక్రవారం కూడా పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. పండుగల సీజన్‌లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. గుడ్ రిటర్న్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతిలో బంగారం ధరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,370గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,08,280గా నమోదైంది.

వివరాలు 

ఢిల్లీలో స్వల్పంగా పెరిగిన పసిడి ..

దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.

దేశ రాజధానిలో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,520గా ఉండగా.. 22క్యారెట్ల ధర రూ.1,32,490గా నమోదైంది.

మరోవైపు ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో బంగారం ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ధరలతో సమానంగా ఉన్నాయి.

తగ్గిన వెండి ధర ..

బంగారం ధరలతో పాటు వెండి ధరల్లోనూ స్వల్ప తగ్గుదల కనిపించింది.

హైదరాబాద్,విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,24,900కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకునే పరిణామాల ఆధారంగా బంగారం,వెండి ధరలు రోజులో పలుమార్లు మారే అవకాశం ఉంది.

అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారు లావాదేవీకి ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT