Gold: మలద్వారంలో బంగారం ముద్ద.. రూ.65.69 లక్షల విలువైన గోల్డ్ స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
మలద్వారంలో బంగారం దాచుకుని అక్రమంగా తరలిస్తున్న 24 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.65.69 లక్షల విలువైన 467.09 గ్రాముల బంగారం ముద్దను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం ముద్దను కరిగించి కడ్డీగా మార్చగా.. దాని బరువు 422.83 గ్రాములుగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని సర్ఫరాజ్ మాలాగా గుర్తించారు. ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో సర్ఫరాజ్ మాలా జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు మలద్వారంలో దాచుకుని విమాన ప్రయాణం చేసినట్లు తెలిపారు. తనిఖీల సమయంలో ఈ అక్రమ రవాణా వ్యవహారం బయటపడటంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు బంగారం అక్రమ రవాణా.. నిందితుడు అరెస్టు
Ahmedabad Customs intercepted a passenger arriving from Jeddah via Doha on 09.08.2026 and recovered 422.83 grams of 24-Kt gold, valued at ₹65.69 lakh, concealed inside his body. The gold was seized and the passenger was arrested under the provisions of the Customs Act, 1962. pic.twitter.com/RsRKMhguIv
— Ahmedabad Customs (@Ahmd_Customs) August 10, 2026