LOADING...
RTC Employee: మెడికల్‌ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
మెడికల్‌ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

RTC Employee: మెడికల్‌ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గుడ్‌న్యూస్ ప్రకటించింది. మెడికల్‌ కారణాలతో అన్‌ఫిట్‌గా గుర్తించిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ రవాణా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ను ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం మెడికల్‌ అన్‌ఫిట్‌గా ప్రకటించిన ఉద్యోగులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇలాంటి ఉద్యోగులను వారి అర్హతలు, శారీరక పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వంలోని ఇతర శాఖలు లేదా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అడ్జస్ట్‌ చేయాలని ఆదేశించారు.

Details

ఉద్యోగులకు ఊరట

దీంతో వైద్య కారణాలతో ఉద్యోగాలు కోల్పోయి గతంలో తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు ఊరట లభించనుంది. మెడికల్‌ అన్‌ఫిట్‌ కారణంగా జీవనాధారం కోల్పోయిన ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ద్వారా వందలాది మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మెడికల్‌ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement