
Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో వారు ఇప్పుడు సాధారణ అంగన్వాడీ టీచర్లకు వర్తించే వేతనాలు పొందనున్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.13,650 చొప్పున జీతం చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు వీరికి నెలకు కేవలం రూ.7,800 మాత్రమే వేతనంగా అందించేవారు.
Details
ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు
తాజా నిర్ణయం ద్వారా మినీ అంగన్వాడీ టీచర్లకు భారీగా వేతనంలో పెంపు కలుగుతుంది.
ఇక మరోవైపు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రభుత్వం ఊరట కలిగించింది.
నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేస్తూ రూ.62 కోట్ల నిధులు విడుదల చేసింది.
దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3,200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు తమ వేతనాలను పొందనున్నారు.
ఈ రెండు నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షాతిరేకాన్ని కలిగించాయి.