Loading...
Mobile Recharge: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై 30 రోజుల రీచార్జ్‌ ప్లాన్స్‌!
మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై 30 రోజుల రీచార్జ్‌ ప్లాన్స్‌!

Mobile Recharge: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై 30 రోజుల రీచార్జ్‌ ప్లాన్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌. ఇప్పటివరకు ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జ్‌ ప్లాన్లలో 28 రోజుల వ్యాలిడిటీకి సంబంధించిన ఆప్షన్లు ఎక్కువగా ఉండేవి. అయితే ఇకపై వినియోగదారులకు మరింత ప్రయోజనం కలిగేలా టెలికాం రీచార్జ్‌ ఆప్షన్లలో మార్పులు రానున్నాయని రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్‌ ప్లాన్లతో పాటు డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ ఓన్లీ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు. ఈ మార్పును ఆయన "తక్కువ బడ్జెట్‌ వినియోగదారుల" విజయంగా అభివర్ణించారు.

వివరాలు

ట్రాయ్‌ కొత్త నిబంధనలు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) సెప్టెంబర్‌ 22, 2026న టెలికామ్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ (13వ సవరణ) రెగ్యులేషన్స్‌ 2026ను విడుదల చేసింది.

ఈ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ ఓన్లీ స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్స్‌ (STVs)ను అందించాల్సి ఉంటుంది.

అదేవిధంగా వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా కలిపిన రీచార్జ్‌ ప్లాన్లను కూడా ప్రతి 30 రోజుల వ్యాలిడిటీ లేదా అంతకన్నా తక్కువ వాలిడిటీ పీరియడ్‌కు అనుగుణంగా టెలికాం సంస్థలు అందించాల్సి ఉంటుంది.

డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌ రీచార్జ్‌ ప్లాన్లను కూడా అందుబాటులో ఉంచాలి.

వివరాలు

28 రోజుల రీచార్జ్‌లకు చెక్‌?

ప్రీపెయిడ్‌ మొబైల్‌ యూజర్లు చాలా కాలంగా ఎదుర్కొంటున్న 28 రోజుల రీచార్జ్‌ విధానానికి తాజా నిబంధనలతో చెక్‌ పడినట్లేనని తెలుస్తోంది.

28 రోజుల వ్యాలిడిటీని 'మంత్లీ ప్లాన్‌'గా పరిగణించడం వల్ల వినియోగదారులు ఏడాదిలో 13 సార్లు రీచార్జ్‌ చేసుకోవాల్సి వస్తోందని రాఘవ్‌ చద్దా గతంలో పార్లమెంట్‌లో తన వాదన వినిపించారు.

ఇప్పుడు 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్‌ ప్లాన్లు అందుబాటులోకి రావడం వల్ల ఏడాదికి 13 సార్లు చేయాల్సి వచ్చే రీచార్జ్‌లు 12కు తగ్గే అవకాశం ఉందని రాఘవ్‌ చద్దా తెలిపారు.

తాజా నిబంధనలను ఆయన స్వాగతించారు.

ADVERTISEMENT

వివరాలు

డేటా అవసరం లేని వారికి ప్రత్యేక ప్లాన్లు

ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌ ఫోన్లు కలిగి ఉండి, మొబైల్‌ను కేవలం కాల్స్‌ కోసం మాత్రమే ఉపయోగించే వారికి ఈ మార్పులు ఉపయోగపడతాయని రాఘవ్‌ చద్దా పేర్కొన్నారు.

అలాంటి వినియోగదారుల కోసం డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలు పొందేలా ప్రత్యేక రీచార్జ్‌ ప్లాన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఈ మార్పులు తక్కువ బడ్జెట్‌ వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తాయని ఆయన వెల్లడించారు.

ADVERTISEMENT