LOADING...
SCR Special Trains : వేసవి రద్దీకి అదనపు రైళ్లు.. SCR కీలక ప్రకటన
వేసవి రద్దీకి అదనపు రైళ్లు.. SCR కీలక ప్రకటన

SCR Special Trains : వేసవి రద్దీకి అదనపు రైళ్లు.. SCR కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి సీజన్ మొదలవుతున్న కొద్దీ రైళ్లలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-గోరఖ్‌పూర్ మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరికొన్ని తేదీలకు పొడిగిస్తూ అధికారికంగా ప్రకటించింది.

వివరాలు 

ప్రత్యేక రైళ్లు పొడిగింపు - తేదీలు

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (ట్రైన్ నెంబర్ 07075) సేవలను పొడిగించారు. ఈ రైలు ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ స్టేషన్ల మీదుగా ప్రయాణించి గోరఖ్‌పూర్‌కు చేరుతుంది.

వివరాలు 

ప్రత్యేక రైళ్లు పొడిగింపు - తేదీలు

ఇదే విధంగా గోరఖ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు నడిచే ప్రత్యేక రైలు (ట్రైన్ నెంబర్ 07076) సేవలను కూడా పొడిగించారు. ఈ రైలు ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో ఈ రైలు ఉదయం 12.30 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు గోండా జంక్షన్, గోమతి నగర్, లక్నో సిటీ, కాన్పూర్ సెంట్రల్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, బీనా జంక్షన్, నాగ్‌పూర్, బల్లార్షా, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట జంక్షన్, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా ప్రయాణించి నాంపల్లి చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

Advertisement