Loading...
Swarna Sachivalayam Employees : స్వర్ణ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఆరేళ్ల సీనియారిటీకి ఏఏఎస్

Swarna Sachivalayam Employees : స్వర్ణ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఆరేళ్ల సీనియారిటీకి ఏఏఎస్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆరేళ్ల సీనియారిటీ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (Automatic Advancement Scheme)అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11వ వేతన సవరణ సంఘం(11వ పీఆర్‌సీ)లో పేర్కొన్న ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ విధివిధానాలను వీరికి వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు విభాగ కార్యదర్శి భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో ఆరేళ్ల సీనియారిటీ ఉన్న స్వర్ణ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ ప్రయోజనం లభించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్వర్ణ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

ADVERTISEMENT