Loading...
Sankranti Special Trains: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు!
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు!

Sankranti Special Trains: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డుకు నాలుగు ప్రత్యేక సర్వీసులు అందించనుంది. జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు (07119) నడవనుంది. ఈ రైలు ఆయా తేదీల్లో సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.

వివరాలు

రైళ్ల షెడ్యూల్

అలాగే, తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ప్రత్యేక రైలు (07120) జనవరి 11, 18 తేదీల్లో నడుస్తుంది.

ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి.

ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ADVERTISEMENT