LOADING...
Rail Parcel App: గుడ్‌న్యూస్.. ఎస్‌సీఆర్ రైల్వే పార్సిల్ యాప్ వచ్చేసింది.. ఇంటి నుంచే బుకింగ్ సౌకర్యం
గుడ్‌న్యూస్.. ఎస్‌సీఆర్ రైల్వే పార్సిల్ యాప్ వచ్చేసింది.. ఇంటి నుంచే బుకింగ్ సౌకర్యం

Rail Parcel App: గుడ్‌న్యూస్.. ఎస్‌సీఆర్ రైల్వే పార్సిల్ యాప్ వచ్చేసింది.. ఇంటి నుంచే బుకింగ్ సౌకర్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే పార్శిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే పార్శిళ్లను బుక్ చేసుకోవడం, పికప్ సర్వీస్ పొందడం అలాగే డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వీలవుతుంది. పార్శిల్ బుకింగ్, ట్రాకింగ్, మేనేజ్‌మెంట్ వంటి అన్ని సేవలు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు.

వివరాలు

వ్యాపారులకు ఎంతో ఉపయోగకరం

ఈ సదుపాయం ముఖ్యంగా స్థానికంగా మిర్చి, పత్తి, పొగాకు వంటి పంటలు సాగు చేసే రైతులు, అలాగే వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ పేమెంట్ సౌకర్యంతో పారదర్శకతను పెంచేలా ఈ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా బల్క్ పార్శిల్ సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించినట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు మరింత మెరుగైన సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.

వివరాలు

యాప్ ముఖ్య లక్ష్యాలు ఇలా ఉన్నాయి

1. డోర్-టు-డోర్ పికప్ మరియు డెలివరీ సౌకర్యం అందించడం 2. కస్టమర్లు సులభంగా యాప్ ద్వారా పార్శిళ్లను బుక్ చేసుకునే అవకాశం 3.పార్శిల్ ఎక్కడ ఉందో రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే సదుపాయం 4. ప్రైవేట్ కొరియర్ సేవల కంటే తక్కువ ఖర్చుతో సేవలు అందించడం 5.ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉండడం 6.ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 7. ఈ యాప్ ద్వారా రైల్వే పార్శిల్ కార్యాలయాల్లో క్యూలను తగ్గించి, సేవలను నేరుగా డిజిటల్ రూపంలో అందించడం 8. పార్శిల్ బుకింగ్ సమయంలో సరుకుల బరువు, దూరం, పార్శిల్ రకం ఆధారంగా ఛార్జీలు నిర్ణయించడం

Advertisement