
Bengaluru: ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి
ఈ వార్తాకథనం ఏంటి
వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు స్కై ఎయిర్ సంస్థ ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా కొద్ది నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
బెంగళూరులోని కోణనకుంట, కనకపుర రోడ్డు ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభించిందని వెల్లడించింది.
డ్రోన్లు కేవలం 7 నిమిషాల్లోనే సరకులను అందజేస్తాయని స్కై ఎయిర్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ కుమార్ తెలిపారు.
ఇప్పటికే నగరంలో ట్రయల్ రన్ నిర్వహించగా, చక్కటి ఫలితాలు వస్తోన్నట్లు వివరించారు.
బ్లూడార్ట్, డీటీడీసీ, షిప్ రాకెట్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, శ్రీమారుతి వంటి ప్రముఖ డెలివరీ సంస్థల ఆర్డర్లను డ్రోన్లతో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
Details
10 కిలోల బరువుతో 120 మీటర్ల ఎత్తు ఎగరగలవు
గతంలో గురుగ్రామ్‌లో ఈ సేవలను ప్రారంభించగా, వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు.
తమ డ్రోన్లు ఒక ట్రిప్‌లో 10 కిలోల బరువుతో 120 మీటర్ల ఎత్తులో ఎగరగలవని, సొరంగ మార్గాల్లోనూ ప్రయాణించగలవని వెల్లడించారు.
డెలివరీ పూర్తయిన తర్వాత డ్రోన్లు స్వయంచాలకంగా బయల్దేరిన స్థానానికి తిరిగి చేరుతాయని చెప్పారు.
దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించి, తక్కువ సమయంలో వేగవంతమైన సేవలను అందించగలమని అంకిత్ కుమార్ తెలిపారు.
డ్రోన్లలో బ్లాక్‌బాక్స్‌లు కూడా ఉండటంతో రికార్డింగ్‌కు సౌలభ్యం ఉంటుందని వివరించారు.