
Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌లో కమిషనర్లుగా నలుగురిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
పీవీ శ్రీనివాస రావు, మోసిన పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలను ఎంపిక చేశారు.
కమిషనర్లుగా ఏడుగురిని నియమించనున్నట్లు ముందుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రభుత్వం ఈ దశలో నలుగురితో ప్రారంభించింది.
పీవీ శ్రీనివాస రావు ఖమ్మం జిల్లా వాసి కాగా, సీనియర్ జర్నలిస్టుగా అనుభవం కలిగినవారు. అయోధ్య రెడ్డి యదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు.
ఆయన గతంలో సీఎం సీఎల్పీఆర్వోగా పనిచేశారు. మైనార్టీ కోటాలో మోసిన పర్వీన్ నియమితురాలవగా, దేశాల భూపాల్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక
Details
10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్
ఇటీవలే మే 5న ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1991 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. చంద్రశేఖర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన బోరెగాన్ గ్రామ వాసి.
రెండేళ్లుగా సమాచార కమిషన్‌లో పదవులు ఖాళీగా ఉండటంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ నియామకాల్లో జాప్యం పై సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేగంగా నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా నియామకాలను చేపట్టింది.
ఎంపికైన వారి జాబితాను రాజ్ భవన్‌కు పంపగా, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.