Loading...
Pawan Kalyan: శస్త్రచికిత్స అనంతరం పవన్‌కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్
శస్త్రచికిత్స అనంతరం పవన్‌కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్

Pawan Kalyan: శస్త్రచికిత్స అనంతరం పవన్‌కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన గవర్నర్‌, శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించిన గవర్నర్‌, వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

వివరాలు 

ఒక పుస్తకంపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆటోగ్రాఫ్

అనంతరం పవన్‌కల్యాణ్‌ స్వగృహంలోని వ్యక్తిగత లైబ్రరీని గవర్నర్‌ సందర్శించారు.

ప్రముఖ రచయితలు, పండితులు, విశ్లేషకులు రచించిన పలు గ్రంథాలను ఆసక్తిగా పరిశీలించారు.

ఆ పుస్తకాల అంశాలపై పవన్‌కల్యాణ్‌తో కొద్దిసేపు చర్చించారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ అభ్యర్థన మేరకు ఒక పుస్తకంపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తన ఆటోగ్రాఫ్‌ను అందించారు.

శస్త్రచికిత్స అనంతరం స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించిన గవర్నర్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ADVERTISEMENT