Loading...
Vishakhapatnam: విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్
విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్

Vishakhapatnam: విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సరకు రవాణాను మరింత సులభతరం చేయడంతో పాటు పోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్టణం పోర్టులో రూ.334.89 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఓడరేవులు, నౌకాయానశాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పోర్టు పరిధిలో సరకు రవాణా వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పోర్టులోని తొమ్మిది ప్రధాన రైల్వే క్రాసింగ్స్‌ వద్ద రైళ్లు, వాహనాల రాకపోకల కారణంగా తరచూ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో సరకు రవాణా వాహనాలు ఆలస్యానికి గురవుతున్నాయి.

వివరాలు 

30 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యం

ఈ సమస్యకు పరిష్కారంగా 3.584 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనున్నారు.

ఇది కాన్వెంట్‌ జంక్షన్‌ను డాక్‌ ఏరియాతో అనుసంధానం చేస్తుంది.

ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే రైలు, రోడ్డు రవాణాను పూర్తిగా వేరు చేయడం సాధ్యమవుతుంది.

ఫలితంగా రైల్వే క్రాసింగ్స్‌ వద్ద వాహనాల రాకపోకలకు ఎదురవుతున్న అంతరాయాలు తగ్గనున్నాయి.

ఈ ప్రాజెక్టును 30 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానశాఖ వెల్లడించింది.

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో పోర్టు లోపల సరకు రవాణా వేగవంతం కావడంతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ మరింత సమర్థంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT