LOADING...
Gymkhana Club: దిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు జారీ
దిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు జారీ

Gymkhana Club: దిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని జింఖానా క్లబ్‌ను ఖాళీ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు క్లబ్ యాజమాన్యానికి తాజా ఎవిక్షన్ నోటీసులు జారీ చేసింది. దేశ రాజధానిలో అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉన్న ఈ స్థలాన్ని భద్రత, రక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే 1971 నాటి చట్టం ప్రకారం ఈ భూమి ప్రభుత్వ ఆస్తేనని నోటీసుల్లో పేర్కొంది. ఈ స్థలాన్ని 1928లో అప్పటి ఇంపీరియల్ దిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్‌కు (ప్రస్తుతం దిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్) శాశ్వత లీజు ప్రాతిపదికన కేటాయించారు.

వివరాలు 

హైకోర్టుకు చేరిన వివాదం

అయితే లీజు ఒప్పందంలోని క్లాజ్-4 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అదే క్లాజ్ ఆధారంగా లీజును రద్దు చేసిన అనంతరం కూడా క్లబ్ స్థలాన్ని ఖాళీ చేయకపోవడం చట్టవిరుద్ధమని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా,ప్రస్తుతం ఆ స్థలంలో కొనసాగుతున్న ఆక్రమణను అక్రమ ఆక్రమణగానే పరిగణిస్తున్నట్లు నోటీసుల్లో వెల్లడించింది. ఇప్పటికే ఈ క్లబ్ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జింఖానా క్లబ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేసింది.

Advertisement