Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ
Ayodhya ram mandir inauguration: శ్రీరాముడి జన్మస్థనం అయోధ్య పులకించిపోయింది. అయోధ్య పురిలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామ జయజయ ధ్వానా మధ్య.. ప్రత్యేక్షంగా వేలాది మంది.. పరోక్షంగా కోట్లాది మంది భక్తులు చూస్తుండగా..అయోధ్యపురిలో శ్రీరాముడు కొలువుదారాడు. వేద మంత్రోచ్ఛర మధ్య 'బాల రాముడి' రూపంలో అయోధ్యపురిలో ఆసీనులయ్యాడు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ మహా క్రతువు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా కన్నుప పండువగా జరిగింది. గర్భగుడిలో రాంలాల్లా కళ్లకు కట్టిన గంతలు తొలగించి స్వావివారిని అద్దంలో చూపించారు. ఈ తంతుతో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయ్యింది. అయోధ్యలో శ్రీరాముడు మంగళవారం నుంచి బాలరాముడి రూపంలో సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.