AP Elections 2024: వైసీపీకి షాక్.. బీజేపీలో చేరిన గూడూరు
ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ఈ మేరకు ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఇక బీజేపీలో చేరిన తరువాత వర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తనకు పార్టీ లో స్తానం కల్పించినందుకు బీజేపీకి అలానే తనకు అవకాశం ఇచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు.
2014లో తిరుపతి ఎంపీ
ఐఎఎస్ అధికారిగా పనిచేసిన వరప్రసాద్ 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వరప్రసాద్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో వరప్రసాద్ వైఎస్ఆర్‌సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల క్రితం వరప్రసాద్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు.