Loading...
Gujarat: గుజరాత్‌లో జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్టు
గుజరాత్‌లో జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్టు

Gujarat: గుజరాత్‌లో జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) కీలక విజయాన్ని సాధించింది. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించిన అధికారులు, ఆ సంస్థతో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిని బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ ముఖి, మహమ్మద్ హసన్ కరాడియా, మహమ్మద్ సునాసరగా గుర్తించారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, విచారణ నిమిత్తం జులై 24 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

వివరాలు 

గుజరాత్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అదుపులోకి ఎనిమిది మంది అనుమానితులు 

ఇటీవల గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఎనిమిది మంది అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

వారిని విచారిస్తున్న సమయంలోనే ఈ ఐదుగురి పాత్ర వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్టు

ADVERTISEMENT