LOADING...
Elvish Yadav: గురుగ్రామ్‌లో దుండగుల సంచలనం.. బిగ్‌బాస్‌ విజేత ఇంటిపై కాల్పులు
గురుగ్రామ్‌లో దుండగుల సంచలనం.. బిగ్‌బాస్‌ విజేత ఇంటిపై కాల్పులు

Elvish Yadav: గురుగ్రామ్‌లో దుండగుల సంచలనం.. బిగ్‌బాస్‌ విజేత ఇంటిపై కాల్పులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్‌బాస్‌ సీజన్‌-2 విజేత, ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఎల్విష్‌ యాదవ్ ఇంటి వద్ద కొంతసేపు ఆగి, అనంతరం 24 రౌండ్ల వరకు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.