
Rains: తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక.. పది జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం మార్పులకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత వాతావరణ విభాగం తాజా సమాచారం ప్రకారం, శుక్రవారం, శనివారం రాష్ట్రంలో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ రెండు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Details
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి
శుక్రవారం వర్షాల సూచన ఉన్న జిల్లాలివే
కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ
పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.