Telangana:ఓటు వేసి వస్తుండగా దారుణం..అతివేగంగా కారు నడిపిన సీఐ కుమారుడు.. కారు ఢీకొని మహిళ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మేరకు నగరంలో భార్య భర్తలు ఓటు వేసి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది.
దీంతో సదరు మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలోనే మహిళ అక్కడికక్కడే ప్రాణం విడిచింది.
35 సంవత్సరాల గాదె కవిత నర్సుగా పనిచేస్తున్నారు. దర్గా కాజీపేటకు చెందిన గాదె జోసెఫ్, కవిత భార్యాభర్తలు.
గురువారం ఈ దంపతులు స్థానిక సెయింట్ గాబ్రియేల్ పాఠశాలలో ఓటు వేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు.
DETAILS
కేసు నమోదు చేసుకున్న కాజీపేట పోలీసులు
ఓటు వేసిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లేందుకు కవిత ద్విచక్రవాహనం ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఫాతిమానగర్ నుంచి దర్గా వైపు కారు అతి వేగంగా వచ్చి కవితను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కవిత తలకు బలమైన గాయాలయ్యాయి.
చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందారు.
నిర్లక్ష్యంగా కారు నడిపిన ఎక్సైజ్ సీఐ కుమారుడు వంశీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు రాస్తారోకో చేపట్టారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాజీపేట పోలీస్ ఇన్స్‌పెక్టర్ రాజు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.