మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు
రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి, జూలైలో నుహ్‌లో హింసను ప్రేరేపించినందుకు గాను గో సంరక్షకుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో హర్యానా కారులో మృతదేహాలు లభ్యమైన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తుల హత్య కేసులో బజరంగ్ దళ్ కార్యకర్త కీలక నిందితుడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని ఒ గ్రామానికి చెందిన నసీర్(25), జునైద్(35)ను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించారు. మరుసటి రోజు, హర్యానా భివానీలోని లోహారులో నిప్పంటించిన కారులో వారి మృతదేహాలు కనుగొన్నారు.
నుహ్‌లో చెలరేగిన హింసాకాండను ప్రేరేపించిన మోను మనేసర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని బెయిలబుల్ సెక్షన్ల కింద మనేసర్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీసు వర్గాలు తెలిపాయి. సాయంత్రంలోగా అతనికి బెయిల్ లభించే అవకాశం ఉందని, జంట హత్యల కేసులో రాజస్థాన్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని చెప్పారు. మోను మనేసర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హర్యానా పోలీస్‌లు తమకి తెలియజేసారని,చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత,తాము తమ ప్రక్రియను ప్రారంభిస్తామని రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ మృదుల్ కచావా చెప్పారు. జులైలో హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండను ప్రేరేపించారని, ఇందులో కనీసం ఆరుగురు మరణించారని కూడా మనేసర్‌పై ఆరోపణలు ఉన్నాయి. జూలై 31న విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన 'బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర' సందర్భంగా హింస ప్రారంభమై, గురుగ్రామ్‌తో సహా పరిసర ప్రాంతాలకు వ్యాపించింది.
గత నెలలో అరెస్ట్ అయిన మానేసర్ సహాయకుడు
మనేసర్ యాత్రకు హాజరయ్యారనే పుకార్లు మత ఘర్షణలకు కారణమయ్యాయి. హత్య కేసులో పరారీలో ఉన్న గోరక్షకుడు ఊరేగింపుకు కొన్ని రోజుల ముందు తాను హాజరవుతానని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తన మద్దతుదారులను కూడా పెద్ద సంఖ్యలో బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొంతమందికి కోపం తెప్పించింది, వారు దీనిని ముప్పుగా భావించి సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్యుద్ధానికి ప్రేరేపించారు. మానేసర్ సహాయకుడు, బిట్టు బజరంగీ కూడా గత నెలలో హింసకు సంబంధించి అరెస్టయ్యాడు, తరువాత అతనికి బెయిల్ కూడా మంజూరు చేశారు.